1000 రోజుల కాంగ్రెస్ విఫల పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి
ట్రాక్టర్లు ఎడ్లబండ్లతో ర్యాలీ
దామర గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువ బ్రిడ్జి నుంచి నడికూడా గ్రామ శివారు వరకు కాలువలు
సందర్శించన్నారు
*రైతు సమస్యలపై చల్లా ధర్మారెడ్డి పోరుబాట*
కౌకొండ, సెప్టెంబర్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 8 గంటలకు దామెర గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువ బ్రిడ్జి నుంచి నడికూడ గ్రామ శివారు వరకు కాలువను సందర్శించనున్నారు.
ఈ సందర్భంగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. పరకాల పట్టణంతో పాటు పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు, గీసుగొండ, సంగెం మండలాలు, జీడబ్ల్యూఎంసీ 15, 16, 17 డివిజన్లకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కౌకొండ గ్రామం మీదుగా ర్యాలీ సాగనున్న నేపథ్యంలో గ్రామస్తులు, బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత భాస్కర్, ఉపసర్పంచ్ ముక్కెర రాజు, నడికూడా మండల అధికార ప్రతినిధి లింగాల తిరుపతి, మాజీ ఎంపీటీసీ మేకల సతీష్, వార్డు సభ్యులు పేర్వాల శరత్‌బాబు, మేకల సుమలత, బీఆర్‌ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి ఇల్లందుల నాగరాజు, మోర్తాల శంకర్రావు, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీతో మాజీ ఉపసర్పంచ్ ముక్కెర సురేష్ పూరెల్ల భాస్కర్. పాలడుగుల కుమారస్వామి .దౌల్తబాజి చందర్ రావు.ఋషగాని శ్యామ్ రావు. మాజీ వార్డు సభ్యుడు ముక్కెర శ్రీనివాస్ పాటు గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కోరారు.
రైతు సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు.

