📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసూధనపల్లి ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

సూధనపల్లి ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

📰 Generate e-Paper Clip

సూధనపల్లి ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి,సెప్టెంబర్ 9,ప్రజావాణి:

 

కురవి మండలం సూధనపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధరావత్ వెంకన్న అధ్యక్షత వహించారు. గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సాహిత్యానికి కాళోజీ నారాయణరావు చేసిన సేవలను వక్తలు గుర్తుచేశారు. విద్యార్థుల్లో తెలుగు భాషపై ఆసక్తిని పెంపొందించేందుకు పద్య పఠనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు చిన్నం ప్రదీప్ కుమార్, ఎం.డి. అంజద్ పాషా, గాండ్ల బాలరాజు, బి. సరోజ, వి. శుభ, కే. సారంగం, ఏ. ప్రగతి, ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ రేఖ మాధవి, ఆయా నీలం వాసవి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎల్లమశెట్టి ధనమ్మ, కమిటీ సభ్యులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.