కోటగిరిలో ఆరోగ్య చైతన్యానికి శ్రీకారం.. HPV వ్యాక్సిన్‌పై అవగాహన
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య భద్రతపై అవగాహన
కోటగిరి: విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు HPV వ్యాక్సిన్ ప్రాధాన్యతను తెలియజేసే లక్ష్యంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటగిరి మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు HPV వ్యాక్సిన్ ప్రాముఖ్యత, దాని ఉపయోగాలు, వ్యాధుల నివారణలో టీకా పోషించే పాత్రపై వివరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణలో ముందస్తు అవగాహన, నివారణ చర్యలు ఎంతో ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు HPV వ్యాక్సిన్‌పై సరైన సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు, తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో HPV వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను తొలగించి, శాస్త్రీయమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా NZB-KMD అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీను, సభ్యులు శ్రీకాంత్, కుమార్, దినేష్, నితిన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

