సూధనపల్లి ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

సూధనపల్లి ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి,సెప్టెంబర్ 9,ప్రజావాణి:   కురవి మండలం సూధనపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధరావత్ వెంకన్న అధ్యక్షత వహించారు. గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సాహిత్యానికి కాళోజీ నారాయణరావు చేసిన సేవలను వక్తలు గుర్తుచేశారు. విద్యార్థుల్లో తెలుగు భాషపై ఆసక్తిని పెంపొందించేందుకు...