📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసంగెం మండల ఎస్సై వంశీకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

సంగెం మండల ఎస్సై వంశీకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

సంగెం మండల ఎస్సై వంశీకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా ఇన్చార్జి: చాతల్ల రమేష్ మాదిగ

ప్రజావాణి హనుమకొండ నవీన్ బ్యూరో
సంగెం సెప్టెంబర్ 28: సంగెం మండల ఎస్సై వంశీకృష్ణకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన చాతాళ్ల రమేష్ మాదిగ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ విధి నిర్వహణలో నిబద్ధతతో ముందుకు సాగుతున్న ఎస్సై వంశీకృష్ణ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందిస్తున్నారని అన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువస్తున్నారని కొనియాడారు.

ఎస్సై వంశీకృష్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. ఆయన జన్మదినం జీవితంలో మరెన్నో విజయాలకు నాంది కావాలని చాతాళ్ల రమేష్ మాదిగ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.