పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
– చింతల రజనీకాంత్
నడికుడ, సెప్టెంబర్ 29 (ప్రజావాణి): ఉమ్మడి వరంగల్–నల్గొండ–ఖమ్మం జిల్లాల పరిధిలోని అర్హత కలిగిన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని నడికుడ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతల రజనీకాంత్ పిలుపునిచ్చారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ముందస్తుగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమైనదని, అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు బాధ్యతగా ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
పట్టభద్రులలో ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పించేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని చింతల రజనీకాంత్ కోరారు.

