📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguమేడారంలో నాని తులాభారం.. 74 కిలోలు

మేడారంలో నాని తులాభారం.. 74 కిలోలు

📰 Generate e-Paper Clip

 

మేడారం( ప్రజావాణి)

ములుగు జిల్లా సమ్మక్క-సారక్క.. తాడ్వాయి మండలం మేడారంలో సినీ హీరో నాని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తులాభారంలో పాల్గొన్నారు.ఆలయ పూజారి విరస్వామి తెలిపిన వివరాల ప్రకారం నాని బరువు 74 కిలోలు ఉన్నట్లు తెలిపారు.
అనంతరం వనదేవతలకు చీరె-సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
నాని దర్శనంతో అభిమానుల్లో సందడి నెలకొంది.ఆలయ పరిసరాల్లో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఫోటోల కోసం ఎగబడ్డారు.పోలీసులు భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించారు.
సమ్మక్క-సారలమ్మ తల్లుల దయతో సినిమా విజయం సాధించాలని నాని మొక్కుకున్నట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.