శివసేన ఆటో యూనియన్ మేడ్చల్ అధ్యక్షుడిగా సత్యనారాయణ గౌడ్
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: నూతన కమిటీ
మేడ్చల్: శివసేన ఆటో యూనియన్ మేడ్చల్ మండల అధ్యక్షుడిగా సత్యనారాయణ గౌడ్ నియమితులయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా రాజు, డీఆర్‌టీయూ మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా మహేష్‌కు బాధ్యతలు అప్పగించారు. బీఆర్‌టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆధ్వర్యంలో నూతన బాధ్యతలను ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత యూనియన్‌పై ఉందన్నారు. ఆటో కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వారికి అందాల్సిన ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. మేడ్చల్ ప్రాంతంలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న పార్కింగ్, ట్రాఫిక్, పోలీస్ తనిఖీలు, వాహనాల పత్రాలు, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై యూనియన్ తరఫున నిరంతరం పోరాడుతామని నాయకులు తెలిపారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి యూనియన్‌ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్‌లోని ఆటో కార్మికుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అందరితో కలిసి పనిచేస్తానని చెప్పారు. యూనియన్‌ను కార్మికులకు అండగా నిలిచే విధంగా ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌టీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సబ్బు ప్రభాకర్, కర్నె రామాంజనేయులు, కాప్రా విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. అహ్మద్ భాయ్, మేడ్చల్ అధ్యక్షుడు పాలపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నియమితులైన నాయకులకు పలువురు అభినందనలు తెలిపారు.

