మట్టి గణపతులనే పూజించాలి. డీజేలపై పూర్తి నిషేధం.
సీఐ చరమంద రాజు.
హుజూర్నగర్ సెప్టెంబర్ 13 (ప్రజావాణి)
వినాయక చవితి పండుగను హుజూర్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు పిలుపునిచ్చారు. సర్కిల్ పరిధిలోని ఎస్సైలతో కలిసి విడుదల చేసిన ఒక వీడియో ద్వారా ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు.
మట్టి గణపతులకే ప్రాధాన్యం:
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ రసాయన రంగుల విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులనే పూజించాలి.
నీటి కాలుష్య నివారణ:
వర్షాభావం వల్ల చెరువులు, కుంటల్లో నీటి మట్టం తగ్గింది. రంగుల విగ్రహాల వల్ల నీరు కలుషితమై తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలి.
డీజేలపై నిషేధం:
శబ్ద కాలుష్య నివారణకు డీజే లను పూర్తిగా నిషేధించారు. మండపాల వద్ద ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరిగినా చర్యలు తప్పవు.
నిబంధనల అమలు:
జిల్లా ఎస్పీ జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను మండప నిర్వాహకులు తు.చ. తప్పకుండా పాటించి పోలీసులకు సహకరించాలని సిఐ చరమంద రాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలకవీడు ఎస్ఐ కోటేష్, నేరేడుచర్ల ఎస్ఐ గోపాల్ రెడ్డి, గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్, మఠంపల్లి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

