📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaవిద్యానగర్ వినాయకుడి వద్ద అన్నదాన వితరణ

విద్యానగర్ వినాయకుడి వద్ద అన్నదాన వితరణ

📰 Generate e-Paper Clip

విద్యానగర్ వినాయకుడి వద్ద అన్నదాన వితరణ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ జిల్లాలోని విద్యానగర్ లోని గణేష్ నవరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి లు అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణం లోని 47 వ డివిజన్ విద్యానగర్ కాలనీ పార్కులో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, స్థానిక కార్పొరేటర్ అబ్బగోని రమేష్ గౌడ్-కవిత దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
గణేష్ విగ్రహాలను నిమజ్జానికి తరలించేటప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. నిమజ్జనానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి, టూ టౌన్ ఎస్సై సైదా బాబా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీవాసులు పంతులు శ్రీనివాస్, వీరారెడ్డి, భూపాల్ రెడ్డి, ఉదయ్ కుమార్, పద్మ గోవిందమ్మ , వేణు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.