గణపతి పూజలో పాల్గొన్న మాజీ హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డి ఎస్సై వంశీకృష్ణ
భక్తిశ్రద్ధలతో గణపయ్యకు అన్నదానం
సెప్టెంబర్ 20.ప్రజావాణి.న్యూస్/ సంగెం
సంగెం మండలం గవిచర్ల లో.వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణపయ్య సన్నిధిలో భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వస్తిక్ యూత్ ఆధ్వర్యంలో రామచంద్రపురం లో పలు గ్రామాలలోఅన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.చిన్నారులు, మహిళలు, యువతతో పాటు వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.భక్తులు సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ,గణపయ్య ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు
.అన్నదానంలో పాల్గొన్న భక్తులు స్వచ్ఛందంగా సేవలందిస్తూ ప్రసాద వితరణలో సహకరించారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంతో హైకోర్టు మాజీ నరసింహారెడ్డి. ఎస్సై వంశీకృష్ణ.గ్రామ సర్పంచ్ బాష్పాక. సదయ్య. ఉప సర్పంచ్ గుమ్మడి సంపత్. శివాలయ చైర్మన్ సరిత భాస్కర్ రెడ్డి. స్వస్తిక్ యూత్. అచ్చ బాలరాజు కూనూర్ సతీష్. రవీందర్ రెడ్డి. పుప్పాల ఏకాంతం. తిరుమల తిరుపతి దేవస్థాన సేవాసమితి మహిళలు శివాలయ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు అందరూ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.అన్నదానం నిర్వహించిన నిర్వాహకులను భక్తులు అభినందించారు.

