*రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం…*
*పిఎసిఎస్ ల బలో పేతానికి 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణం.*
*ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ.*
*ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25*
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వ హించిన అర్ధవార్షిక మహాజనసభ కార్యక్రమం లో ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పిఎసిఎస్ కార్యకలాపాలు , రైతు లకు అందుతున్న సేవలు , ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలు , వ్యవసాయ రంగ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన వివరించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గ్రామస్థాయి లో రైతులకు నేరుగా సేవలు అందించే ముఖ్య మైన వ్యవస్థలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అని తెలిపారు. రైతులకు అవసరమైన రుణాలు , వ్యవసాయ సంబంధిత సేవలు , ధాన్యం కొనుగోళ్లు తది తర కార్యక్రమాల్లో పిఎసిఎస్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకుని ప్రజా ప్రభుత్వం అనేక కార్య క్రమాలను అమలు చేస్తోందని ఆయన తెలి పారు. రైతు రుణ మాఫీ , రైతు భరోసా , రైతు బీమా వంటి పథకాలు కొనసాగు తున్నాయని పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడు తోందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి పిఎసిఎస్ పరిధిలో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని బీర్ల ఐలయ్య తెలిపారు. ప్రతి పిఎసిఎస్ కు 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తో గోదాములను నిర్మించ నున్నట్లు వెల్లడించారు. గోదాముల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవ డానికి , పంట ఉత్పత్తు లకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించ డానికి ఈ గోదాములు ఉపయోగపడతాయని అన్నారు. పిఎసిఎస్ ల ద్వారా ధాన్యం కొనుగోళ్ల ను మరింత సమర్థవంతం గా నిర్వహిస్తున్నామని అయిలయ్య తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు సకాలంలో చెల్లింపులు అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. రైతులు దళారు లపై ఆధారపడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా తమ పంటను విక్రయించుకు నేలా అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామని తెలి పారు. రైతుల సంక్షేమం , వ్యవసాయ రంగ అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అయిలయ్య తెలిపారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆలేరు నియోజకవర్గంలో రైతులు , గ్రామీణ ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను దశల వారీగా చేపడు తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హు లైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజాప్రతినిధులు , అధికారులు సమన్వయం తో పనిచేయాలని సూచించారు. పిఎసిఎస్ లను రైతులకు మరింత చేరువగా తీసుకెళ్లి , వాటి ద్వారా అందించే సేవలను విస్తరించాలని ఆయన అన్నారు. రైతుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ ప్రజా ప్రభుత్వంలో మరోసారి గోదావరి జలాలను వినియోగించి ఆలేరు నియోజకవర్గంలోని అన్ని చెరువులు , వాగులను నింపేందుకు చర్యలు తీసు కుంటామని తెలిపారు.
ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం వల్ల తాగునీరు , సాగునీటి కొరత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. రైతులు , ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , పరిస్థితు లను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఆలేరు నియోజకవర్గంలోని చెరువులు , వాగులు మరోసారి నీటితో కళకళలాడేలా గోదావరి జలాలను తరలించేందుకు కృషి చేస్తామని, తాగునీటి తో పాటు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ పాలకవర్గ సభ్యులు , అధికారులు , వ్యవసాయ శాఖ అధి కారులు , సహకార శాఖ సిబ్బంది , రైతులు , స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

