*రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తా*
*జనగామలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ*
*ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి*
జనగామ జిల్లాప్రతినిధి , సెప్టెంబర్ 29 (ప్రజావాణి):
జనగామ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం జనగామ పట్టణం, జనగామ రూరల్ ప్రాంతాలకు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనగామ పట్టణానికి చెందిన 19 మంది, జనగామ రూరల్‌కు చెందిన 17 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.
*సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు తావు లేదు*

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చూసే బాధ్యత తనదని అన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, ఆడపిల్లల పెళ్లికి ఈ పథకాలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
*అర్హులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి*
అర్హత ఉన్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

