మనోహరాబాద్: ఇంటి ఈఎంఐలు చెల్లించలేక మనస్తాపంతో యువకుడు బలవన్మరణం
మనోహరాబాద్: ఇంటి ఈఎంఐలు చెల్లించలేక మనస్తాపంతో యువకుడు బలవన్మరణం మనోహరాబాద్: (ప్రజావాణి) ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దబాల యాదగిరి, నాగవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు హరిప్రసాద్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఇల్లు నిర్మించుకునేందుకు రుణం తీసుకున్నారు. అయితే, ఇటీవల జరిగిన రోడ్డు...