బీఆర్ఎస్ కౌన్సిలర్ బాలు కు అవమానం?
••ప్రభుత్వ విప్ రాకతో వెనకవెళ్లామన్నా హౌసింగ్ అధికారి
••హౌసింగ్ పీడీపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ బాలు డిమాండ్
సిరిసిల్ల, ప్రజావాణి
ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో తనకు తగిన గౌరవం ఇవ్వకుండా అవమానించారని బీఆర్ఎస్ 1వ వార్డు కౌన్సిలర్ బాలు ఆరోపించారు. ఈ ఘటనపై రాజన్న ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. కౌన్సిలర్ బాలు మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధిగా కార్యక్రమానికి తనను ఆహ్వానించి, అనంతరం అక్కడి నుంచి వెనక్కి పంపించడం బాధాకరమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులందరికీ సమాన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
తనను ఎందుకు వెనక్కి పంపించారని హౌసింగ్ పీడీ వెంకట మాధవరావును ప్రశ్నించగా, ప్రభుత్వ విప్ కార్యక్రమానికి రావడంతో తాము వెనక్కి వెళ్లామని సమాధానం ఇచ్చారని బాలు తెలిపారు. అయితే ప్రజా ప్రతినిధిని ఇలా పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
*కలెక్టర్ జోక్యం చేసుకోవాలి*
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కౌన్సిలర్ బాలు కోరారు. ప్రజా ప్రతినిధిని అవమానించేలా వ్యవహరించిన హౌసింగ్ పీడీ వెంకట మాధవరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ భేదాలకు తావులేకుండా ప్రజా ప్రతినిధులందరికీ సముచిత ప్రాధాన్యత, గౌరవం కల్పించాలని అన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కౌన్సిలర్ బాలు విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ కౌన్సిలర్ బాలు కు అవమానం..?
RELATED ARTICLES

