📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణ*ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

*ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

*ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

 

 

 

బి జె వై ఎం నాయకులు మనోజ్ కుమార్

 

 

 

మద్దూరు సెప్టెంబర్ 12, ప్రజా వాణి,

 

 

 

 

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడి పిలుపునివ్వడంతో పూర్వ ఎబివిపి నాయకులు మనోజ్ కుమార్ ను పోలీసులు తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు, ప్రజల గొంతులను ముందస్తు అరెస్టులతో నొక్కాలని చూస్తే ప్రభుత్వానికి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.మద్దురు పోలీసులు చేపట్టిన ముందస్తు అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరుసగా ముందస్తు అరెస్టులు చేయడం ద్వారా విద్యార్థుల గొంతులను నొక్క లేరని అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ప్రజల కోసం పోరాడుతున్న వారి సంకల్పాన్ని నిర్బంధాలు ఎప్పటికీ దెబ్బతీయలేవనీ అన్నారు.ఎన్ని నిర్బంధాలు, అరెస్టులు చేసినా మేము వెనక్కి తగ్గేది లేదనీ స్పష్టం చేశారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ఒక హక్కు అని,ఆ హక్కును ఎవరూ కాలరాయలేరనీ”ఆయన అన్నారు.

ప్రభుత్వం అణచివేత ధోరణులను వీడనాడాలని అన్నారు.ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.