📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బంగాళాఖాతంలో బలపడుతున్న తూఫాన్

బంగాళాఖాతంలో బలపడుతున్న తూఫాన్

📰 Generate e-Paper Clip

బంగాళాఖాతంలో బలపడుతున్న తూఫాన్

పలాస ఉద్ధానము లో భారీ వర్షాలు

మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు…

పలాస ప్రజావాణి ప్రతినిధి

బంగాళ ఖాతాము లో ఏర్పడిన
తుఫాన్ ప్రభావం వల్ల
తీవ్ర వాయుగుండం మారి తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం వద్ద ఉన్న అల్పపీడనం బలపడి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందనీ తెలిపారు. ఇది సెప్టెంబర్ 23 ఉదయానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీర సమీపానికి చేరుకుంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
దీని కోసం రాగల మూడు రోజుల్లో పలాస ఉద్దానములో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందినీ వెల్లడి చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.
సముద్రంలో అలలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీని ప్రభావము వల్ల శ్రీకాకుళం, విజయనగరము , విశాఖ పట్నం , అనకాపల్లి జిల్లా కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీ పురము, మన్యం జిల్లాలో వరదలు వచ్చే ప్రమాదము ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.