📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ

చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ

📰 Generate e-Paper Clip

చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ,

పెద్దవంగర. సెప్టెంబర్ 21 ప్రజావాణి

మండలంలో వడ్డేకొత్తపల్లి చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను యూత్ సభ్యులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు సోమవారం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు..ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని వారి కుటుంబానికి గణపతి దేవుడు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకున్నారు.ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని చాటుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు కన్నె శివప్రసాద్, సభ్యులు తాటిపాముల జగన్, బండారి యుగంధర్ గౌడ్, రాజు, క్రాంతి, తాటిపాముల రాజు, గంగాధరి సాయి, గణేష్, మద్దెల శ్యామ్ రాజ్, నరసింగం ప్రసాద్, శేషగిరి,మద్దెల వీరన్న, కొంతం శ్యామ్, అభిలాష్, జస్వంత్, సాయిరాం, రావుల సందీప్, చట్టు వెంకన్న,ప్రజాప్రతినిధులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.