📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్*ప్రథమ చికిత్స కేంద్రంలో అనధికార వైద్యంపై ఆరోపణలు*

*ప్రథమ చికిత్స కేంద్రంలో అనధికార వైద్యంపై ఆరోపణలు*

📰 Generate e-Paper Clip

*ప్రథమ చికిత్స కేంద్రంలో అనధికార వైద్యంపై ఆరోపణలు*

*రోగ నిర్ధారణ లేకుండానే ఇంజక్షన్లు, సెలైన్లు*

*మందులు, వైద్య సేవల పేరుతో అధిక వసూళ్ల ఆరోపణలు*

మేడ్చల్, నేడున్యూస్: మేడ్చల్‌ వెంచర్‌లోని శ్రీ ఉమామహేశ్వర ప్రథమ చికిత్స కేంద్రం నిర్వహణపై స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రథమ చికిత్స అందించి, అవసరమైతే పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయాల్సిన కేంద్రంలో అర్హతలపై అనుమానాలున్న వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నారని వారు చెబుతున్నారు.

స్థానికుల కథనం ప్రకారం.. ఉమామహేశ్వర మెడికల్‌ షాప్‌ పక్కనున్న మరో షాపులో రోగులకు చికిత్స అందిస్తున్నారు. రోగి సమస్యను పూర్తిగా పరిశీలించ

కుండానే పెయిన్‌కిల్లర్లు, ఇంజక్షన్లు, సెలైన్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మందుల ఖర్చుతో పాటు వైద్య ఫీజును వేర్వేరుగా వసూలు చేస్తున్నారని కూడా స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల రాత్రి బైక్‌పై నుంచి పడిన ఓ వ్యక్తి శరీరంపై స్వల్ప వాపుతో కేంద్రానికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. గాయాన్ని పూర్తిగా పరిశీలించకుండానే ఇంజక్షన్లు, సెలైన్‌ ఇచ్చి, బ్యాక్‌ బెల్ట్‌ పెట్టారని ఆరోపించారు. సమస్యను నిర్ధారించకుండా చికిత్స చేయడం వల్ల అనుకోని ఇబ్బందులు తలెత్తితే బాధ్యత ఎవరిదని వారు ప్రశ్నిస్తున్నారు.

*ఆరోగ్య శాఖ తనిఖీలు చేయాలి*

కేంద్రంలో అర్హత కలిగిన సిబ్బంది సేవలు అందిస్తున్నారా? అనుమతులు, రిజిస్ట్రేషన్లు, వైద్య అర్హతలు, మందుల విక్రయ నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై ఆరోగ్య శాఖ అధికారులు సమగ్రంగా తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

అనవసరంగా ఇంజక్షన్లు, సెలైన్లు ఇచ్చి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత వ్యక్తులు, సంస్థలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.