మద్యపాన నిషేధంపై అక్టోబర్ 2న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయండి.
అక్టోబర్ 7న చలో అమరావతికి భారీగా తరలిరావాలి
ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు అడ్డూరి అనిల్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ, సీనియర్ నాయకులు ఆరెపల్లి పవన్ మాదిగ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథి ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ మద్యపాన నిషేధాన్ని కోరుతూ అక్టోబర్ 2న నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మద్యపానంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం మద్యపాన నిషేధంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఎల్కతుర్తి మండలం నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
అదేవిధంగా అక్టోబర్ 7న చలో అమరావతి కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతిలో ఆరోజు నిర్వహించనున్న నూతన మండల జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు ఎల్కతుర్తి మండలం నుంచి భారీగా హాజరు కావాలని సూచించారు.
ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో ముందుకు రావాలని ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ కోరారు.
సీనియర్ నాయకులు ఆరెపల్లి పవన్ మాదిగ మాట్లాడుతూ సంఘం చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు ఫోరం నాయకులు బొంకూరి వంశీ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి చిలుముల వినోద్ మాదిగ, మండల నాయకులు అడ్డూరి నవీన్ మాదిగ, అల్లకొండ బాలు మాదిగతో పాటు ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

