వైభవంగా టీచర్స్ కాలనీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు..
ఏడో రోజు ప్రత్యేక పూజలు.. ఘనంగా అన్నప్రసాద వితరణ..
ఉత్సవ కమిటీ సభ్యులను సన్మానించిన కౌన్సిలర్లు తోట జ్యోతి, జిల్లేపల్లి నాగేశ్వరరావు..
కోదాడ, సెప్టెంబర్ 20/ ప్రజావాణి
“మట్టి విగ్రహాలను పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుకుందాం” అనే ఆదర్శవంతమైన ఉద్దేశంతో స్థానిక టీచర్స్ కాలనీలో నిర్వహిస్తున్న రెండో వార్షికోత్సవ గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు కాలనీలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు భారీగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.ఈ అన్నప్రసాద వితరణ మహోత్సవంలో 28వ వార్డు కౌన్సిలర్ తోట జ్యోతి శ్రీనివాస్, 20వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ జిల్లేపల్లి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మట్టి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి, సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్నందుకు గణేష్ ఉత్సవ కమిటీ నియోజకవర్గ అధ్యక్షులు కోడుమూరి ప్రవీణ్, గౌరవ అధ్యక్షులు చెన్నకేశవరావుతో పాటు కమిటీ సభ్యులను కౌన్సిలర్లు ప్రత్యేకంగా అభినందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.

