📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadపర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని ప్రతిష్టించాలి

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని ప్రతిష్టించాలి

📰 Generate e-Paper Clip

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని ప్రతిష్టించాలి

 

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి ప్రతిష్ఠించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ తొర్రూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో మట్టి గణపతిని ప్రతిష్ఠించారు.
ఈ సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, శ్రీ వినాయకుని కృపతో పాలకుర్తి ఎమ్మెల్యే నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఆమె, ప్లాస్టర్ ఆఫ్ పారిస్
(పి ఓ పి) గణపతుల స్థానంలో మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ హిత గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మట్టి గణపతుల వినియోగం వల్ల నీటి వనరులు కాలుష్యం కాకుండా ప్రకృతి పరిరక్షణకు తోడ్పాటు అందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మోత్కురి వీంద్ర చారి , పదో వార్డ్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముద్దసాని సురేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా గంజి విజయపాల్ రెడ్డి, జక్కా మహబూబ్ రెడ్డి, గంజి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన నాయకులు, అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో మట్టి గణపతి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.