ఓడీఎఫ్ కాలనీలో బాల గణనాథుడి వైభవం
అమీన్పూర్, సెప్టెంబర్ 15 (ప్రజావాణి): అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో బాల గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాల గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన కాలనీవాసులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గణపయ్య దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కాలనీ పండుగ శోభను సంతరించుకుంది. గణనాథుడి నామస్మరణతో పరిసరాలు మార్మోగాయి.
RELATED ARTICLES

నిషిత్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ కళా ప్రతిభను చాటుకున్నారు. లయబద్ధమైన నృత్యాలతో చిన్నారులు అలరించగా.. కాలనీవాసులు చప్పట్లతో వారిని అభినందించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన చిన్నారులకు షీల్డులు అందజేసి ప్రోత్సహించారు.
