దన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మష్రూమ్ సాగు శిక్షణ ప్రారంభం
గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ
మద్దూరు సెప్టెంబర్ 29, ప్రజా వాణి,
మద్దూర్ మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో,ధన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మష్రూమ్ సాగు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ,ఉప సర్పంచ్ భరత్ రెడ్డి,జిల్లా ఎల్ డీ ఎం హరి బాబు,నాబార్డు డి డి ఎం నిఖిల్ రెడ్డి,యూనియన్ బ్యాంక్ అర్ ఎస్ ఈ టి ఐ డైరెక్టర్ గేము నాయక్, ఈ డి సి ప్రోగ్రామ్ మేనేజర్ శిరీష, ధన్ ఫౌండేషన్ సిబ్బంది నరేష్, అర్ ఎస్ ఈ టి ఐ సిబ్బంది, ఎఫ్ పి ఓ చైర్మన్ రామ్ రెడ్డి డైరెక్టర్లు, శిక్షణార్థులు, రైతులు పాల్గొన్నారు.
మష్రూమ్ సాగు ద్వారా రైతులు, గ్రామీణ యువతకు ఉపాధి మరియు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించేందుకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం నిర్వహించడంతో పాటు ధన్ 30వ ఫౌండేషన్ డే వేడుకలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

