*ముదిగొండ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ*
_రూ. 4,45,500 విలువైన సహాయ నిధి చెక్కులు అందజేత_
_మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రఘురామిరెడ్డిలకు లబ్ధిదారుల కృతజ్ఞతలు_
ముదిగొండ సెప్టెంబర్ 29 ప్రజావాణి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆశీస్సులతో, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి సిఫార్సు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం ఆర్ ఎఫ్) చెక్కులను ముదిగొండ మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు స్థానిక నవతేజ ఫంక్షన్ హాల్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఉన్న 18 మంది నిరుపేద బాధితులకు మొత్తం రూ. 4,45,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
లబ్ధిదారుల వివరాలు:
* అప్పిరెడ్డి (వల్లపురం) – రూ. 1,60,000/-
* పఠాన్ జాన్ బీ – రూ. 60,000/-
* నాగేశ్వరరావు (ముత్తారం) – రూ. 60,000/-
* గుడపల్లి ఉమ (పమ్మి) – రూ. 44,000/-
* ఒట్టే మోహన్ రావు (కట్టకూరు) – రూ. 31,500/-
* కూరపాటి పద్మ (బాణాపురం) – రూ. 27,500/-
* బంక రవి (వెంకటాపురం) – రూ. 24,500/-
* వడ్డం సత్యనారాయణ (ముదిగొండ) – రూ. 24,000/-
* దేవరపల్లి వెంకయ్య (గంధసిరి) – రూ. 23,500/-
* సైదమ్మ (గోకినపల్లి) – రూ. 21,000/-
* గౌస్ పాషా (గోకినపల్లి) – రూ. 21,000/-
* షేక్ నూర్జాన్ – రూ. 20,000/-
* లక్ష్మి తానబోయిన – రూ. 19,000/-
* ఆశ షేక్ (ఎడవెల్లి) – రూ. 19,000/-
* ప్రవీణ్ చిన్నబాబు (గంధసిరి) – రూ. 10,000/-
* షేక్ నూర్జాన్ బేగం (అయ్యగారిపల్లి) – రూ. 8,000/-
* షేక్ నజీరుద్దీన్ బేగం (అయ్యగారిపల్లి) – రూ. 8,000/-
* మేకపోతుల రేణుక – రూ. 5,000/-
ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో అండగా నిలుస్తోందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని నాయకులు పేర్కొన్నారు. పేదలకు అండగా నిలిచిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, ఎంపీ రఘురామిరెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ వాకదాని కన్నయ్య, మందారపు శ్రీనివాసరావు, జూలకంటి సంజీవరెడ్డి, రావులపాటి శ్రీనివాసరావు, తాతా నరేష్, పమ్మి ఉపసర్పంచ్ పంజాల రాజేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోటమల్ల ఉదయ్ రాజ్, కొమ్ము ఉపేందర్ మరియు పలువురు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

