భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన ఐలమ్మ
నైజాం గడీల గుండెల్లో నిద్రపోయిన ధైర్యం – చాకలి ఐలమ్మ
తెలంగాణ పోరాటానికి స్ఫూర్తి ప్రదాత
ములుగు గొల్లపెల్లి శ్రీకాంత్ (ప్రజావాణి)
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి నేడు. 1985 సెప్టెంబర్ 10న ఆమె మరణించారు.
1919లో వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం క్రిష్ణాపురంలో నిరుపేద రజక కుటుంబంలో జన్మించిన ఐలమ్మ, నాటి దొరల పెత్తనాన్ని, వెట్టిచాకిరిని ఎదిరించిన తొలి మహిళ.
విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి తన భూమిని లాక్కోవాలని చూస్తే, “భూమి నా ప్రాణం, ఇయ్యను” అంటూ కమ్యూనిస్టుల అండతో తిరగబడింది. ఆమె పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది.
అండ్ర కొడుకులు, దొడ్డి కొడుకులు కాదు.. భూమి దున్నేటోడికే భూమి కావాలె నేడు తెలంగాణ ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. ఆమె స్ఫూర్తితోనే నేడు మహిళా లోకం ముందుకు సాగుతోంది.
నేడు వర్ధంతి సందర్భంగా ఆ వీరవనితకు ఘన నివాళులు.. జోహార్ చాకలి ఐలమ్మ!
తెలంగాణ గడ్డ మీద దొరల అహంకారాన్ని ఎదిరించిన తొలి ఆడబిడ్డ.. చాకలి ఐలమ్మ! చేతిలో బట్టలు ఉతికే కట్టె తప్ప ఏమీ లేని ఆమె, నైజాం సైన్యాన్నే గడగడలాడించింది. తన భూమి కోసం, తన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రాణాలకు తెగించి పోరాడింది. అలాంటి వీరవనిత నేడు మన మధ్య లేకపోయినా.. ఆమె పోరాట స్ఫూర్తి మాత్రం తెలంగాణ పల్లె పల్లెనా ఇంకా బతికే ఉంది. జోహార్ ఐలమ్మ.. జోహార్!”

