కూనవరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ నిరసన: చంద్రబాబు అక్రమ అరెస్టు దినాన్ని బ్లాక్ డే గా పాటించిన పార్టీ శ్రేణులు
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్ 9
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు మరియు 53 రోజుల అనంతరం 2023 అక్టోబర్ 31న రాజమహేంద్రవరం సెంటర్ జైలు నుంచి ఆయన విడుదలైన ఘటనలకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలిసింది సందర్భంగా కూనవరం మండల కేంద్రంలో పార్టీ నాయకులు, శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఆయన్ను అక్రమ కేసుల పేరిట 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన రోజును ‘బ్లాక్ డే’గా పాటిస్తూ, మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమం మండల టీడీపీ ఉపాధ్యక్షులు చెలికాని ఉమ, యూనిట్ ఇన్‌చార్జ్ చెలికాని వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో . కూనవరం మండల కేంద్రంలో నాయకులు, తెలుగు మహిళలు, తెలుగు యువత కార్యకర్తలు చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ నిర్వహించి, అప్పటి నిరంకుశ చర్యలను తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ
ఈ సందర్భంగా నాయకులు చెలికాని ఉమ, చెలికాని వెంకటలక్ష్మి మాట్లాడుతూ, నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపుతోనే చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు బనాయించిందని మండిపడ్డారు. దేశం గర్వించదగ్గ సీనియర్ రాజకీయ నేతను జైలుపాలు చేసి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రజల గొంతు నొక్కాలని చూసినా, చివరకు న్యాయమే గెలిచిందని వారు స్పష్టం చేశారు. అక్రమ బంధనాలను ఛేదించుకుని ధర్మం, సత్యం వైపే విజయం నిలిచిందని, ప్రజల ఆశీస్సులతో ప్రజాపాలన మళ్లీ సాకారమైందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా ప్రతినిధులు, తెలుగు యువత నాయకులు, స్థానిక కూటమి శ్రేణులు మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొని. జై చంద్రబాబు జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భూతిన్చార్జి హెచ్ రాము కో ఆప్షన్ సభ్యులు షరీఫ్ గ్రామ కమిటీ అధ్యక్షులు హెచ్ రవి గడ్డం నవీను గద్దల శ్రీకాంత్ సాయిరాం ఎడ్ల వెంకటేశ్వర్లు భాను తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

