చాకలి శ్యామమ్మ కుటుంబానికి సర్పంచ్ ఒగ్గు సాయికిరణ్ ఆర్థిక సహాయం
మన సమగ్ర ప్రజావాణి ( నేరడి గుంట) సెప్టెంబర్ 11 సంగారెడ్డి జిల్లా ప్రతినిది
చాకలి శ్యామమ్మ గారు అకాల మరణం చెందడం పట్ల గ్రామ సర్పంచ్ ఒగ్గు సాయికిరణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శ్యామమ్మ గారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి అండగా నిలిచే ఉద్దేశంతో సర్పంచ్ ఒగ్గు సాయికిరణ్ తరఫున రూ.5,000 ఆర్థిక సహాయాన్ని ఉపసర్పంచ్ కోదండ ఈశ్వర్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా శ్యామమ్మ గారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బోయిని శంకర్, ఆశయ, ఒగ్గు దేవరాజు, యువ నాయకులు, అలాగే చాకలి భూమయ్య, చాకలి మొదలయ్య, చాకలి మాసయ్య, చాకలి శంకరయ్య, చాకలి నాగయ్య తదితర గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

