మద్దూరులో ఘనంగా ఆత్మ హత్యల నివారణ దినోత్సవం
ఏ ఎన్ ఏం జ్యోతి ఆధ్వర్యంలో
కిషోర బాలికలతో ప్రతిజ్ఞ
ఆత్మ హత్యలతో సమస్యలు పరిష్కారం కావు
మద్దూరు గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం
మద్దూరు సెప్టెంబర్10, ప్రజా వాణి,
ఆత్మ హత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకొని మద్దూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఏ ఎన్ ఏం జ్యోతి ఆధ్వర్యంలో ఆత్మ హత్యల నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు, కిశోర బాలికలకు ఆత్మ హత్యల నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం మాట్లాడుతూ తెలిసి తెలియని వయస్సులొ యువతి యువకులు ఒత్తిడులను జయించలేక ఆత్మ హత్యలు చేసుకోవడంతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఎవరైనా అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే కుటుంబానికి మంచిది కాదని దేవుడు ఇచ్చిన ఆయుష్షు ముగిసే వరకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చే బిడ్డలుగా సమాజంలో జీవించాలని అన్నారు. మానసికంగా ఎవరైనా బాధపడుతుంటే తక్షణమే 14416 హెల్ప్ లైన్ నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు మంజుల,శోభ, కిశోర బాలికలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

