చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
•••పేదల హక్కుల కోసం పోరాడిన విరనారి.
•••ఐలమ్మ ఆశయా సాధనకు కృషి చేయ్యాలి.
•°మాధగోని అంజయ్య గౌడ్
మంచాల, సెప్టెంబర్ 26 (ప్రజావాణి):
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వైఎస్సార్ నేత మాధగోని జంగయ్యగౌడ్ పిలుపునిచ్చారు.మంచాల మండల కేంద్రంలోని చెరువు కట్టపై ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం మండల అధ్యక్షుడు లొంగరి మల్లేష్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ యువసేన నాయకుడు లొంగరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాధగోని జంగయ్యగౌడ్ మాట్లాడుతూ.. రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ అని అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహనీయురాలు అని కొనియాడారు.సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఐలమ్మ సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. భూమి, భుక్తి, జీవన హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం అణగారిన వర్గాల్లో హక్కులపై చైతన్యం తీసుకొచ్చిందన్నారు.
*ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి*
ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను అండగా నిలిచిన చాకలి ఐలమ్మ దొరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి, పేదలకు భూములు దక్కేలా చేసిన గొప్ప పోరాట యోధురాలని గుర్తు చేశారు.ప్రతి తెలంగాణ పౌరుడు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, సేవలను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలని జంగయ్యగౌడ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంచాల మండల రజక సంఘం ఉపాధ్యక్షుడు మొగిలి శ్రీశైలం, రజక సంఘం రాష్ట్ర నాయకులు అవతాపురం శ్రీరాములు, మంచాల మండల గౌరవ అధ్యక్షుడు గాలయ్య, వివిధ పార్టీల నాయకులు, రజక సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

