జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
ఘనంగా సత్కరించిన పీఆర్‌టీయూ టీఎస్ మండల శాఖ
పరిగి సెప్టెంబర్ 26(ప్రజావాణి)
విద్యా రంగానికి విశేష సేవలందిస్తూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను పీఆర్‌టీయూ టీఎస్ కుల్కచర్ల మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల శాఖ ప్రతినిధులు వారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
సన్మానం పొందిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు:
శ్రీ కావలి శ్రీశైలం – స్కూల్ అసిస్టెంట్ (తెలుగు), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలురు), కుల్కచర్ల
శ్రీ విస్లావత్ తులసి నాయక్ – స్కూల్ అసిస్టెంట్ (గణితం), ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సాల్వీడ్
శ్రీ కొండ ఎల్లయ్య – స్కూల్ అసిస్టెంట్ (జీవశాస్త్రం), ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ముజాహిద్‌పూర్
శ్రీ భక్తవత్సల్ – స్కూల్ అసిస్టెంట్ (హిందీ), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలికలు), కుల్కచర్ల
ఎం ఆంజనేయులు – స్కూల్ అసిస్టెంట్ (భౌతికశాస్త్రం), ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పుట్టపహాడ్
ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ నాయకులు మాట్లాడుతూ, నిరంతరం విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమిస్తూ జిల్లా స్థాయిలో గుర్తింపు పొందడం మండలానికే గర్వకారణమని కొనియాడారు. ఉత్తమ ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తూ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వి ఆర్ టి యు మండల అధ్యక్షుడు శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి దస్తయ్య, గౌరవ అధ్యక్షుడు డి వెంకటయ్య,పెంటయ్య,బస్వరాజు,ఆనంద్, రాఘవేందర్ రెడ్డి, శేఖర్,మండల పీఆర్‌టీయూ పలు పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.