📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetజాతీయస్థాయి గణిత ఒలింపియాడ్లో జయ విద్యార్థుల ప్రతిభ

జాతీయస్థాయి గణిత ఒలింపియాడ్లో జయ విద్యార్థుల ప్రతిభ

📰 Generate e-Paper Clip

కోదాడ టౌన్, సెప్టెంబర్ 26 ( ప్రజావాణి): జాతీయస్థాయిలో నిర్వహించిన ఏ.ఎం.టి.ఐ. గణిత ఒలింపియాడ్లో జయ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రెండవ లెవలు అర్హత సాధించారని పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నైలోని ఏఎంటిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత ఒలింపియాడ్లో జయ పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు రెండవ లెవల్ కు అర్హత సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు జాతీయస్థాయి పోటీపరీక్షల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.
ఏ.ఎం.టి.ఐ.లో ప్రైమరీ లెవల్ నుంచి ముగ్గురు, సబ్ జూనియర్ లెవల్ నుంచి ఆరుగురు, జూనియర్ లెవల్ నుంచి ఏడుగురు విద్యార్థులు రెండవ లెవల్ కు అర్హత సాధించారని తెలిపారు. జయ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు ఈ స్థాయి విజయాన్ని సాధించడం సంతోషంగా ఉందన్నారు. రెండవ లెవల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచేలా విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక శిక్షణ అందిస్తుందని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, శిక్షణ అందిస్తున్న ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్ బింగి జ్యోతి, జిల్లా విద్యా ప్రణాళికాధికారులు విద్యార్థులను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.