📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఏపీఆర్‌ లగ్జూరియాకు రోడ్ల మహర్దశ

ఏపీఆర్‌ లగ్జూరియాకు రోడ్ల మహర్దశ

📰 Generate e-Paper Clip

*ఏపీఆర్‌ లగ్జూరియాకు రోడ్ల మహర్దశ!*

*రూ.1.80 కోట్లతో నూతన తారురోడ్లకు ప్రతిపాదనలు..*

*నిధుల మంజూరుకు మాజీ కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌ యాదవ్‌ వినతి

పటాన్‌చెరు, సెప్టెంబర్ 29(ప్రజావాణి):జేపీ కాలనీ డివిజన్‌ పరిధిలోని ఏపీఆర్‌ లగ్జూరియా కాలనీ రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు రానున్నాయి. కాలనీలో నూతన తారురోడ్ల నిర్మాణానికి రూ.1 కోటి 80 లక్షల 20 వేల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరుతూ పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌ యాదవ్‌ మంగళవారం జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ నారాయణ అమిత్‌ ఐఏఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సహకారంతో ఆయన సిఫారసు లేఖను కూడా జోనల్‌ కమిషనర్‌కు అందజేశారు. ఏపీఆర్‌ లగ్జూరియా కాలనీలోని పలు ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెట్టు కుమార్‌ యాదవ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

*వర్షాకాలంలో మరింత ఇబ్బందులు*

వర్షాలు కురిసిన సమయంలో రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. కాలనీలో పెరుగుతున్న జనాభా, వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన రహదారి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

*త్వరితగతిన నిధులు మంజూరు చేయాలి*

కాలనీవాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రూ.1.80 కోట్లకు పైగా ప్రతిపాదిత నిధులను త్వరితగతిన మంజూరు చేసి నూతన తారురోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని మెట్టు కుమార్‌ యాదవ్‌ కోరారు. రహదారుల అభివృద్ధి పూర్తయితే కాలనీవాసులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

*సానుకూలంగా స్పందించిన జోనల్‌ కమిషనర్‌*

ఏపీఆర్‌ లగ్జూరియా కాలనీ రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలపై జోనల్‌ కమిషనర్‌ నారాయణ అమిత్‌ సానుకూలంగా స్పందించినట్లు మెట్టు కుమార్‌ యాదవ్‌ తెలిపారు. సమస్యను పరిశీలించి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సహకారంతో పటాన్‌చెరు, జేపీ కాలనీ డివిజన్‌లలో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని మెట్టు కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.