📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetలబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

📰 Generate e-Paper Clip

కోదాడ సెప్టెంబర్29 (ప్రజావాణి): ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి యర్రవరం గ్రామానికి చెందిన లబ్ధిదారు బారు సత్యావతికి తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు. వైద్య చికిత్సల ఖర్చులను భరించలేని కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అత్యవసర వైద్య అవసరాల సమయంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో యర్రవరం సర్పంచ్ రావుల భవాని వెంకటేశ్వర్లు, రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు భాషబోయిన భాస్కర్, పీఏసీఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాస్‌రావు, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు వేమూరి మధు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.