📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసీఎం పాదయాత్రకు పోలీసుల ట్రయల్ డ్రిల్

సీఎం పాదయాత్రకు పోలీసుల ట్రయల్ డ్రిల్

📰 Generate e-Paper Clip

*సీఎం పాదయాత్రకు పోలీసుల ట్రయల్ డ్రిల్*

••సిరిసిల్లలో భారీ బందోబస్తు

రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రజావాణి

రేపు సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం అంబేద్కర్ చౌక్ నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా ట్రయల్ డ్రిల్ నిర్వహించారు.ఐజీ కమలహాసన్‌రెడ్డి పర్యవేక్షణలో, ఎస్పీ మహేష్ బి. గితే ఆధ్వర్యంలో ప్రత్యేక రోప్ టీమ్‌తో ప్రాక్టికల్ డ్రిల్ చేపట్టారు. సీఎం రోప్ బందోబస్తు మధ్య ఏ విధంగా నడవాలి, భద్రతా సిబ్బంది ఎలా కదలాలి, మార్గంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై పోలీసులు ముందస్తు సాధన నిర్వహించారు.సీఎం పాదయాత్ర సజావుగా సాగేందుకు మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.