📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ

చలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

చలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

ఇల్లంతకుంట, సెప్టెంబర్ 4 (ప్రజావాణి)

ఇల్లంతకుంట మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చలో ఇందిరా పార్క్ పోస్టర్‌ను శుక్రవారం మండల కేంద్రంలోని రెడ్డి సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, మండల రెడ్డి సంఘం అధ్యక్షులు ఉమ్మెంతల మహిపాల్ రెడ్డి, వివిధ గ్రామాల రెడ్డి సంఘాల అధ్యక్షులు, నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు రెడ్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తేదీన ధర్నా చౌక్, ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు మండలంలోని రెడ్డి బాంధవ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా ఈసీ సభ్యులు కంకనాల శ్రీనివాస్ రెడ్డి, మండల రెడ్డి సంఘం ఉపాధ్యక్షులు సంతోష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గడ్డం రవీందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కేతిరెడ్డి మల్లారెడ్డి, ఈసీ సభ్యులు గురిజాల కిషన్ రెడ్డి, ఐరెడ్డి సురేందర్ రెడ్డి, ఉప్పుల సంజీవ రెడ్డి, పండుగ ఎల్లారెడ్డి, గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షులు తూముకుంట తిరుపతి రెడ్డి, మిర్యాల కిషన్ రెడ్డి, ఒరేం శివా రెడ్డి, పండుగ రాజిరెడ్డి, కట్నాపెల్లి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
అలాగే నాయకులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, చల్ల నవీన్ రెడ్డి, సింగిరెడ్డి రాంరెడ్డి, కేతిరెడ్డి నవీన్ రెడ్డి, తూముకుంట రాజేందర్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల రెడ్డి సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.