📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలు

ఘనంగా శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

*ఘనంగా శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలు*

*రాయికల్, సెప్టెంబర్ 17 (ప్రజావాణి):*

రాయికల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర విశ్వబ్రాహ్మణ మనుమయ సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం నుండి సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ భగవానుడి విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు, పూలతో అలంకరణ, వేద మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాయికల్ తహసీల్దార్ ఎస్. నాగార్జునచారి హాజరై స్వామివారికి, వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సృష్టికి మూలకర్త, శిల్పకళ, వాస్తుకళ, సకల చేతివృత్తులకు ఆద్యుడు శ్రీ విశ్వకర్మ భగవానుడని కొనియాడారు. ప్రతి సంవత్సరం విశ్వబ్రాహ్మణులు ఐక్యతతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారని, భావితరాల యువత మన సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.పూజా కార్యక్రమాల అనంతరం సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ సంఘ సభ్యులు భక్తిశ్రద్ధలతో అన్నప్రసాదాన్ని అందించారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ, శ్రీ విశ్వకర్మ భగవానుడి కృపతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మానాల వెంకటి, కొమురోజు వెంకట్రాములు, మానాల శ్రీహరి, పాలిక రవీందర్, పిప్పోజీ మహేందర్ బాబు, గట్టుపెల్లి నరేష్ కుమార్, చింతల అజయ్ కుమార్, శ్రీగద్దె రాజు, గట్టుపెల్లి రమేష్ కుమార్, ఇమ్మడి విజయ్ కుమార్, సంకోజి అశోక్, కుంబోజి కిషన్, గొల్లపల్లి వెంకటరమణ, కుంబోజి రవి, కొడిమ్యాల భాస్కర్, మచ్చ నారాయణ, బోడుగం మోహన్ జీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.