*ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు*
*రాయికల్, సెప్టెంబర్ 17 (ప్రజావాణి):*
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాయికల్ పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎస్. నాగార్జున, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బింగి చిరంజీవి జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. గ్రామాల్లో సర్పంచులు, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి.ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాలలో ఎంపీడీవో బింగి చిరంజీవి, తహసీల్దార్ ఎస్. నాగార్జున మాట్లాడుతూ, సెప్టెంబర్ 17వ తేదీకి చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమై నిజాం నిరంకుశ పాలన అంతమై ప్రజా పాలన ప్రారంభమైన నేపథ్యంలో ఈ రోజును ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజలకు మెరుగైన, పారదర్శక పాలన అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీవో సుష్మా, ఏపీఎం నరహరి, ఏపీవో దివ్య, సూపరింటెండెంట్,మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

