📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణYadadri Bhuvanagiriఘనంగా ప్రపంచ ఫార్మసీ దినోత్సవం

ఘనంగా ప్రపంచ ఫార్మసీ దినోత్సవం

📰 Generate e-Paper Clip

*ఘనంగా ప్రపంచ ఫార్మసీ దినోత్సవం…*

*ప్రజలకు అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టు ల పాత్ర కీలకమం.*

*విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఫార్మసిస్టులకు సన్మానం.*

*డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25*

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్‌లో టిజీపిఓఏ జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. మనో హర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ , ఫార్మసీ విభాగం ప్రత్యేకంగా పని చేసే విభాగం కాదని , ఆరోగ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగమని అన్నారు. ఒక యంత్రంలోని ప్రతి భాగం సమన్వయంతో పనిచేసి నప్పుడే అది సక్రమంగా పనిచేస్తుందని , అదే విధంగా ఆరోగ్య వ్యవస్థ లోని ప్రతి విభాగం పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలమన్నారు.
వైద్యులు , ఫార్మసిస్టులు, నర్సింగ్ సిబ్బంది , ల్యాబ్ సిబ్బంది , ఇతర ఆరోగ్య సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. మందుల సరైన నిల్వ , నాణ్యత, పంపిణీతో పాటు వైద్యుల సూచనల మేరకు మందుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టు ల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ప్రపంచ ఫార్మసీ దినోత్సవాన్ని పురస్క రించుకొని విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు ఫార్మసిస్టులు బి. శ్రీనివాస్ , నిర్మల , సరిత , ఉమారాణిలను డీఎంహెచ్‌ఓ డా. మనో హర్ ఘనంగా సన్మా నించారు. ఈ కార్యక్రమం లో డీఐఓ డా. రామకృష్ణ , పీవో డా. వీణ , డెమో పద్మ , జిల్లా స్టోర్ ఇన్‌చార్జి శ్రీనివాస్తో పాటు ఫార్మసిస్టులు , ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.