📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన జూలకంటి సీతారాం రెడ్డి

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన జూలకంటి సీతారాం రెడ్డి

📰 Generate e-Paper Clip

*సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన జూలకంటి సీతారాం రెడ్డి*

ప్రజావాణి బయ్యారం, సెప్టెంబర్ 17:
బయ్యారం మండలంలోని గౌరారం, సంతులాల్ బోడు తండా గ్రామాలకు చెందిన ముగ్గురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, సింగిల్ విండో డైరెక్టర్ జూలకంటి సీతారాం రెడ్డి గురువారం అందజేశారు.
ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందిన మూడ్ తరుణ్‌కు రూ.20 వేలు, ధరావత్ రాజుకు రూ.14 వేలు, బొల్లెంపల్లి బాబుకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.59 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ సహకారంతో, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నాయకత్వంలో ఈ చెక్కులు మంజూరైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జూలకంటి సీతారాం రెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యంతో చికిత్స పొందిన నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందడం ఉపశమనంగా ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
చెక్కులు మంజూరుకు సహకరించిన ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్యలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుల్లూరి బాలరాజు, కొత్త వినయ్ బాబు, ఈసం పాపారావు, భూక్య సతీష్, ధారా రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.