📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకస్తూర్బా బాలిక విద్యాలయంలో ఘనంగా ఉపాధ్యాయులకు సర్పంచ్ సన్మానం

కస్తూర్బా బాలిక విద్యాలయంలో ఘనంగా ఉపాధ్యాయులకు సర్పంచ్ సన్మానం

📰 Generate e-Paper Clip

కస్తూర్బా బాలిక విద్యాలయంలో ఘనంగా ఉపాధ్యాయులకు సర్పంచ్ సన్మానం

మద్దూరు సెప్టెంబర్ 16, ప్రజా వాణి,

మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా బాలిక విద్యాలయంలో గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం ఉప సర్పంచ్ షకీల్ అహ్మద్ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులను మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది నీ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దామెర మల్లేశం మాట్లాడుతూ, ఉపాధ్యాయులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను గతంలో ఎంతోమంది విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చానని, ప్రస్తుతం వారు వార్డు సభ్యులుగా,ఉపాధ్యాయులుగా సేవలందించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు.విద్యార్థులు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ గౌరవించాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానిస్తానని చెప్పారు.
మండల విద్యాధికారి వరదరాజులు మాట్లాడుతూ, సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, ఉపాధ్యాయులను గౌరవించడం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలని, విద్యతో పాటు ఏదో ఒక నైపుణ్యాన్ని (నైపుణ్యం) నేర్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. క్రీడలలో మంచి ప్రతిభ చూపించాలి అని పేర్కొన్నారు కస్తూర్బా బాలిక విద్యాలయ సిబ్బంది అందరు కూడా పిల్లల చదువు మరియు వారి ఎదుగుదలకు కృషి చేస్తున్నారు అని ఏం ఈ ఓ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.