📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యుత్ తీగలతో రైతులకు ముప్పు

విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు

📰 Generate e-Paper Clip

విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు!
మనిషికి అందేంత ఎత్తులో వేలాడుతున్న తీగలు
పలుమార్లు మోటార్లు కాలిపోతున్నా పట్టించుకోని అధికారులు
ఝరాసంగం, సెప్టెంబర్ 16 (ప్రజావాణి): ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 37లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందికి వేలాడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నాలుగు ఎకరాల పొడవునా విద్యుత్ తీగలు మనిషికి అందేంత ఎత్తులో ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు లైన్‌మెన్‌కు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని రైతులు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడి పలుమార్లు మోటార్లు కాలిపోయాయని పేర్కొన్నారు.
రైతుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేసి, రహదారి పక్కగా సురక్షితంగా ఏర్పాటు చేయాలని రైతులు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.