బాల గణపతి మండపంలో సర్పంచ్ ప్రత్యేక పూజలు
బెజ్జంకి, సెప్టెంబర్ 16 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామంలోని పాత గ్రామపంచాయతీ కాలనీలో భక్త మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల గణపతి మండపంలో బుధవారం సర్పంచ్ బైరా మానస రాజేందర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.అనంతరం భక్త మండలి సభ్యులు సర్పంచ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ
వినాయక చవితి మన సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవడంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని కోరారు.బాల గణపతి మండపాన్ని ఏర్పాటు చేసిన భక్త మండలి సభ్యులను అభినందించారు.

