📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetజిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

లక్ష్మీపూర్ హెచ్‌ఎం ఎం.డి. షాదుద్దీన్‌కు సర్పంచ్, గ్రామస్తుల అభినందనలు

బెజ్జంకి, సెప్టెంబర్ 16 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.డి. షాదుద్దీన్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న సందర్భంగా సర్పంచ్ ముక్కిస కవిత రత్నాకర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సృజనాత్మకతను పెంపొందించేలా షాదుద్దీన్ చేస్తున్న కృషిని సర్పంచ్ అభినందించారు. పాఠశాల ఆవరణలో కూరగాయల సాగు, గోడలపై వర్ణమాల, చిత్రాలు వేయడం, ఆటపాటల ద్వారా విద్యార్థులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.ఈ సందర్భంగా షాదుద్దీన్ మాట్లాడుతూ.. బెజ్జంకి మండలంతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని, లక్ష్మీపూర్ నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. గ్రామ ప్రజలు చూపిన ఆత్మీయ అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గంగాధర హరీష్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.