ఎత్తొండ పిఎసిఎస్ కు పూర్వ వైభవం తీసుకురావాలి.
నామినేటెడ్ అధ్యక్షుడిగా కొత్త సోమశేఖర రావును నియమించాలి.
సంఘం పరిధిలోని ఐదు గ్రామాల రైతుల ఏకగ్రీవ తీర్మానం.
సంఘం పూర్వ వైభవానికి ఐక్యంగా నిలిచిన రైతుల
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని నిశ్చయం.
రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటున్నా కొత్త సోమశేఖర రావు.



కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లోని ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పిఎసిఎస్) నామినేటెడ్ అధ్యక్షుడిగా గతంలో చైర్మన్ గా వ్యవహరించిన కొత్త సోమశేఖర రావును మరో మారు నియమించాలని సంఘం పరిధిలోని ఐదు గ్రామాల రైతులు,సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.మంగళవారం ఎత్తొండ సొసైటీ భవిష్యత్తు,అభివృద్ధిపై చర్చించేందుకు ఐదు గ్రామాల రైతులు ఒక చోట చేరి ప్రత్యేక సమావేశాన్ని ఎత్తొం డ గ్రామంలో నిర్వహించారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ఎంతో పేరుగాంచి,అభివృద్ధి పథంలో కొనసాగిన ఎత్తొండ సొసైటీ నేడు కొందరి నిర్లక్ష్యం,అవినీతి అక్రమాల కారణంగా దాదాపు సంఘం రూ.22 కోట్ల నష్టాల్లోకి నెట్టివేసి నిర్వీర్యం అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో సొసైటీ అధ్యక్షునిగా ఎన్నుకునే అవకాశం కల్పించిన నేపథ్యంలో నిజాయితీ,స్వాతంత్ర ప్రతిపత్తి ఉన్న పాలకవర్గాన్ని ఎన్నుకుంటేనే సంఘం తిరిగి గాడిలో పడుతుందని రైతులు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.ఎత్తొండ,ఎత్తొండ క్యాంప్,యాద్గార్‌పూర్, వల్బాపూర్,సిద్దాపూర్ గ్రామాల రైతులు,సంఘ సభ్యులు పార్టీలకతీతంగా ఏకమై కొత్త సోమశేఖర రావు పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తున్నామని.గతంలో ఆయన చైర్మన్‌గా ఉన్నప్పుడు 24 గంటలు సంఘ అభివృద్ధి కోసం పరితపించారని గుర్తుచేశారు.ఈ మేరకు కొత్త సోమశేఖర రావు పేరును ఐదు గ్రామాల రైతుల మందరం కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తామని ఈ సందర్భంగా నిర్ణయించారు.ఇకపై సంఘంలో ఎలాంటి తప్పులు జరిగిన సహించేది లేదని,ప్రతి ఒక్కరూ ప్రశ్నించి తిరగబడాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కొత్త సోమశేఖర రావు మాట్లాడుతూ.తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ప్రతిపాదించిన ఐదు గ్రామాల రైతు లకు,సంఘ సభ్యులకు రుణపడి ఉంటానని తెలిపారు. కొందరు ఈ తీర్మానాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా,మీ అందరి ఆదరాభిమానాలతో వాటిని అధిగమిస్తానని ధీమా వ్యక్తం చేశారు.కోర్టులో ఉన్న అంశాలను చట్ట ప్రకారం పరిష్కారం అవుతాయని.సంఘంలో ఏదైనా అవినీతి తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు.ధాన్యం కొనుగో లు,కాటా విషయంలో ప్రతి రైతుకు ఒకే విధానం ఉండేలా దృష్టి సారిస్తానని అన్నారు.ఎరువులు,విత్తనాలు సకాలం లో రైతులకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.సంఘానికి సంబంధించిన రైస్ మిల్లును పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి పూర్వ వైభవం తీసుకువ చ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గతంలో ప్రతిపక్ష హోదాలో ఉండి సంఘంలో జరుగుతున్న అక్రమాలపై సకా లంలో స్పందించకపోవడం,సమావేశాలకు రాకపోవడం పట్ల ఒక రైతుగా చింతిస్తున్నానని ఆవేదన చెందారు.మన సం ఘం మనమందరం కలిసి ఈ సంఘ అభ్యున్నతికి పాటుప డదాం అని రైతులకు ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్ర మంలో ఎత్తొండ ప్రాథమిక సహకార పరపతి సంఘం సభ్యు లు,ఎత్తొండ,ఎత్తొండ క్యాంప్,యాద్గార్‌పూర్,వల్బాపూర్, సిద్దాపూర్ గ్రామాల రైతులు,తదితరులు పాల్గొన్నారు.

