📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కల్లూరు ఆర్‌ఎస్ పారిశుద్ధ్య కార్మికుల పోరాటానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు

కల్లూరు ఆర్‌ఎస్ పారిశుద్ధ్య కార్మికుల పోరాటానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు

📰 Generate e-Paper Clip

అనంతపురం జిల్లా,గార్లదిన్నె సెప్టెంబర్ 01 ప్రజావాణి మండలం కల్లూరు ఆర్‌ఎస్ గ్రామ పంచాయతీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు డాక్టర్ సాకే శైలజనాథ్ సార్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా రైతు విభాగ అధ్యక్షులు వై నారాయణ రెడ్డి గారు, మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి గారి సూచన మేరకు వైఎస్సార్‌సీపీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది.గత మూడు నెలలుగా జీతభత్యాలు అందకపోతే కార్మికుల కుటుంబాలు ఎలా జీవించాలి?7–8 నెలలుగా నిత్యావసర సరుకులు అందకపోతే వారి కుటుంబాలు ఎలా గడవాలి?నెలకు కేవలం ₹6,000–₹8,000 జీతంతో కుటుంబ పోషణ సాధ్యమేనా?పారిశుద్ధ్య కార్మికుల బకాయి జీతాలను వెంటనే చెల్లించి,వారి వేతనాలను పెంచి,నిత్యావసర సరుకులు సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.“స్వచ్ఛ భారత్” అని చెప్పడం మాత్రమే కాదు…
స్వచ్ఛతను క్షేత్రస్థాయిలో ఆచరణలో చూపిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో కూడా వెలుగు నింపాలి. ప్రధాని మోదీ గారు స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడుతున్న వేళ,గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజూ కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు అందకపోతే స్వచ్ఛ భారత్ ఎలా సాధ్యం? అని ప్రశ్నిస్తున్నాము.అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖను నిర్వహిస్తున్న నేపథ్యంలో,గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు విడుదల చేసి, పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.కార్మికుడి చెమటతో గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది,అలాంటి కార్మికుడి ఇంట్లో పొయ్యి వెలగకపోతే అది పాలకుల వైఫల్యం!బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి!
నిత్యావసర సరుకులు వెంటనే అందించాలి!
పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచాలి! పంచాయతీలకు అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలి!ఇందులో భాగంగా,చీమల శ్రీనివాస్,తాటికొండ దేవా,సోషల్ మీడియా గ్రామ అధ్యక్షుడు షారోన్ కుమార్,చితంబరెడ్డి,భాస్కర్ రెడ్డి, రఫీ,పీర,ప్రసాద్,సద్దల పుల్లన్న,చాంద్ భాషా,ఎగువపల్లి సింగరా,ముంటిమడుగు కాసిం,అగ్రహారం జయరాముడు,విభూతి రాజు,దూదేకుల ఎల్లప్ప,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.