📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetమహిళా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి.

మహిళా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి.

📰 Generate e-Paper Clip

మహిళా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి.

మహిళా, బాలల కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా చూడాలి: ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్.

హుజూర్నగర్ అక్టోబర్ 29 (ప్రజావాణి)

మహిళలు, బాలలపై జరిగే నేరాల్లో వేగంగా స్పందించి బాధితులకు సత్వర పోలీసు, వైద్య, న్యాయ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. మహిళా బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం, కేసులు పెండింగ్‌లో ఉండకుండా పర్యవేక్షించడం లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డితో కలిసి జిల్లా భరోసా టీమ్, సూర్యాపేట, కోదాడ డివిజన్ల షీ టీమ్స్, డీసీఆర్బీ మహిళా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, బాలల భద్రత విషయంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మహిళా సంబంధిత కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత సమయంలో చార్జిషీట్లు కోర్టులకు సమర్పించాలని సూచించారు. బాధితులు, సాక్షుల వాంగ్మూలాలను పక్కాగా నమోదు చేయడంతోపాటు అవసరమైన సందర్భాల్లో వీడియో రికార్డింగ్ చేయాలని తెలిపారు. దాడులు, వేధింపులు, అత్యాచారం వంటి తీవ్రమైన కేసుల్లో తక్షణమే స్పందించి బాధితులకు పోలీసు, వైద్య, న్యాయ సేవలు అందించాలని ఆదేశించారు.

బాధిత మహిళలకు సామాజికంగా, నైతికంగా ధైర్యం కల్పించి, వారికి అండగా నిలవాలని సూచించారు. బాల బాధితులకు విద్యా సదుపాయాలు కల్పించడంతోపాటు ప్రభుత్వం ద్వారా అందే ఆర్థిక సహాయం, ఇతర పునరావాస సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సూర్యాపేట, కోదాడ డివిజన్ల పరిధిలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెల్స్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని, కుటుంబ సమస్యలతో వచ్చే బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలిపారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో నూతనంగా నిర్మిస్తున్న షీ టీమ్ కార్యాలయం, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెల్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూర్యాపేట డీఎస్పీకి సూచించారు.

ఈ సమీక్షలో సూర్యాపేట, కోదాడ డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీనివాస్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ మగ్దుం అలీ, మహిళా ఎస్‌ఐ ఝాన్సీ, భరోసా ఎస్‌ఐ మౌనిక, షీ టీమ్ ఎస్‌ఐలు మల్లేష్, నీలిమ, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.