వరుణుడి కోసం వినూత్న పూజ – అంగడిపేట లో కప్ప పెళ్లి వేడుక
తెలంగాణ సాంప్రదాయం మళ్ళీ సజీవం – అంగడిపేట లో కప్పల పెళ్లి వేడుక
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న వేళ, వరుణుడిని ప్రసన్నం చేసుకున్న చందూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామం 4వ వార్డు, 5వ వార్డులలో స్థానికులు వినయంగా “కప్ప పెళ్లి (ఫ్రాగ్ మ్యారేజ్)” వేడుకలు ఘనంగా జరిగాయి.
ఇది తెలంగాణ పల్లెల్లో తరతరాలుగా వస్తున్న నమ్మకం. కప్పలకు పెళ్లి చేస్తే ఇంద్రుడు కరిగి వర్షం కురిపిస్తాడని ప్రజల విశ్వాసం.
*వేడుక ఎలా జరిగింది:*
– చిన్నారులు, మహిళలు రెండు కప్పలను తీసుకువచ్చారు, వాటికి పసుపు, కుంకుమ, పూల దండలతో అలంకరించారు
– డప్పు చప్పుళ్లు, కోలాటాల మధ్య అంగడిపేట వీధుల్లో కప్పల పెళ్లి ఊరేగింపు చేశారు
– పెళ్లి తంతు పూర్తి చేసి, మొక్కులు తీర్చుకుని, వర్షం కురవాలని ప్రత్యేక పూజలు చేశారు
– 4వ వార్డు, 5వ వార్డుల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకలను ఆనందించారు.
“పంటలు ఎండుతున్నాయి, బోర్లు అడుగంటుతున్నాయి. పెద్దలు చెప్పినట్టు కప్ప పెళ్లి చేస్తే వర్షం పడుతుందని మా నమ్మకం. అందుకే మా వార్డులో ఈ ఆట ఆడాము” అని స్థానిక మహిళలు తెలిపారు. ఈ కప్ప పెళ్లి వేడుకతో అంగడిపేటలో చిన్నారుల కేరింతలు, సంప్రదాయ సందడి. త్వరలో వర్షం కురవాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కౌన్సిలర్ జెల్ల శ్రీను, ఐదవ వార్డు కౌన్సిలర్ కొండ్రెడ్డి మధు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఇరిగి రామన్న, ఇడికూడ శేఖర్, చిలువేరు బిక్షపతి, గ్రామ పెద్దలు చిన్నారులు పాల్గొనడం జరిగింది.

