పిఆర్సీ అమలు.. సిపిఎస్ రద్దు.. పెండింగ్ డీఏల కోసం క్రీడా వేదికగా నిరసన గళం
హుజూర్‌నగర్–కోదాడ నియోజకవర్గాల ఉపాధ్యాయుల స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్
కోదాడ, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): పిఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు, పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలనే డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు క్రీడా వేదికగా తమ ఆకాంక్షలను చాటారు. కోదాడ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ఉపాధ్యాయుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ సోమవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు క్రీడా స్ఫూర్తితో పోటీపడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా నిలిచారు.ఈ కార్యక్రమానికి కోదాడ మండల విద్యాధికారి మహమ్మద్ సలీం షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిఆర్టీయూ టిఎస్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్, టిఎస్ యూటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పీ. శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎన్. నాగేశ్వరరావు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు భూక్య శ్రీనునాయక్, టిఎస్ సిపిఎస్ఇయూ జిల్లా అధ్యక్షులు లక్కపాక ప్రవీణ్, సిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు,పిఆర్టీయూ టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పిన్ని మధు, టిజియూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య జయంత్, పిడి సంఘం జిల్లా బాధ్యులు గంధం రంగారావు తదితరులు పాల్గొన్నారు.అలాగే అనంతగిరి మండల యూటిఎఫ్ అధ్యక్షులు మండవ ఉపేందర్, కోదాడ యూటిఎఫ్ అధ్యక్షులు పీ నర్సింహారావు,
ఎస్టియూ. సంఘ బాధ్యులు ఎన్. అంకిరెడ్డి, కోదాడ నియోజకవర్గ కెప్టెన్ షేక్ జబ్బార్, హుజూర్‌నగర్ నియోజకవర్గ కెప్టెన్ నూకతొట్టి శ్రీను, పిఆర్టీయూ టిఎస్ మేళ్లచెరువు అధ్యక్షులు నాగల నరసింహారెడ్డి, కోదాడ మండల అధ్యక్షులు సాదె లక్ష్మీనారాయణ, మేళ్లచెరువు మండల యూటిఎఫ్ ప్రధాన కార్యదర్శి కె. అంజి, అనంతగిరి మండల యూటిఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎం. బాబు, చింతలపాలెం అధ్యక్షులు దొంగరి లక్ష్మీనారాయణ,యూటిఎఫ్ ప్రధాన కార్యదర్శి జి. బాలరాజు, కోదాడ మండల ప్రధాన కార్యదర్శి పిడమర్తి అంకులయ్య, మునగాల ప్రధాన కార్యదర్శి సుల్తాని శంకర్, కోదాడ మండల పిఆర్టీయూ మాజీ ప్రధాన కార్యదర్శి పీ. రవీందర్‌రెడ్డి, కోచ్ సిద్ధిక్, ఆర్గనేజర్ బుల్లయ్య పాల్గొన్నారు
మ్యాచ్‌కు ఆఫీషియల్స్‌గా ఆనంద్, శ్రీకాంత్ వ్యవహరించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బాధ్యులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మ్యాచ్‌ను ఉత్సాహంగా తిలకించారు.

