📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguగణేష్ మండపాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి

గణేష్ మండపాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి

📰 Generate e-Paper Clip

.నార్లపూర్ – ఎస్ఐ కమలాకర్.

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

గణేష్ మండపాల వద్ద భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని ఎస్ఐ కమలాకర్ సూచించారు.
నార్లపూర్ (మేడారం) పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పరిశీలించారు. ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే.. అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటివి జరగకుండా ఉంటాయని తెలిపారు.
రాత్రి పూట పోలీసుల పెట్రోలింగ్ ముమ్మరంగా ఉంటుందని, నిర్వాహకులు కూడా మండపం వద్ద నిఘా ఉంచాలని సూచించారు. గణేష్ ఉత్సవాలను మతసామరస్యంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.